అక్షరటుడే, హైదరాబాద్: Gram Panchayat elections | తెలంగాణ రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ Polling మొదలైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. ఈ రోజ మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది.
మూడో విడత ఎన్నికల కోసం 36,483 పోలింగ్ స్టేషన్లు,43,856 బ్యాలెట్ బాక్స్‌లు ఏర్పాటు చేశారు. 3,547 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ జరుగుతోంది. మొత్తం 2,489 మంది మైక్రో అబ్జర్వర్లు, 4,502 మంది ఆర్వోలు, 77,618 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.
Gram Panchayat elections | ఆ పల్లెల్లో జరగని పోలింగ్..
ఈ విడతలో మొత్తం 182 మండలాల్లోని 4,159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. కాగా, వీటిల్లో 394 పంచాయతీలు, 7,908 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మరో 11 పంచాయతీలు, 116 వార్డు స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు చేయలేదు. దీంతో ప్రస్తుతం 3,752 పంచాయతీలకు, 28,410 వార్డులకు పోలింగ్ కొనసాగుతోంది. సర్పంచి స్థానాల్లో 12,652 మంది, వార్డు స్థానాల్లో 75,725 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.