149
అక్షరటుడే, వెబ్డెస్క్: Gram Panchayat election | తెలంగాణలో గురువారం తొలి విడత పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ.. మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Gram Panchayat election | ఆనందంలో ఒక్కసారిగా..
కాగా, తొలి విడత పోలింగ్లో విషాదం చోటుచేసుకుంది. కొడుకు సర్పంచిగా గెలుపొందిన ఆనందంలో తల్లి గుండెపోటుతో కుప్పకూలింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. రుద్రూర్ మండలం రానంపల్లి సర్పంచి ఎన్నికల్లో కొండలవాడి శంకర్ ఘన విజయం సాధించారు.
కొడుకు గెలిచిన ఆనందాన్ని స్థానికులతో పంచుకుంటూ ఆయన తల్లి లింగవ్వ(60) ఒక్కసారిగా కింద పడిపోయారు. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారు.