Homeజిల్లాలునిజామాబాద్​Paddy Centers | కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలి

Paddy Centers | కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలి

రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని వేల్పూర్ తహశీల్దార్​ శ్రీకాంత్, కమ్మర్​పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాలెపు నరసయ్య అన్నారు. ఈ మేరకు గురువారం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

- Advertisement -

అక్షరటుడే, భీమ్​గల్: Paddy Centers | రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని.. తద్వారా రైతులకు మద్దతు ధర అందుతుందని వేల్పూర్ (Velpur) తహశీల్దార్​ శ్రీకాంత్ అన్నారు. వేల్పూర్ మండలం అమీనాపూర్​లో ఐకేపీ (IKP) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఏపీఎం మాణిక్యంతో కలిసి గురువారం ప్రారంభించారు.

రైతులు ధాన్యాన్ని నిర్దేశిత మాయిశ్చర్​ వచ్చేలా ఆరబెట్టి విక్రయించాలని సూచించారు. దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోని విక్రయించి లబ్ధి పొందాలన్నారు. కార్యక్రమంలో ఐకేపీ సీసీ మురళి, రాధ, లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు స్వరూప, ఇంద్రాగౌడ్, కిరణ్ గౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Paddy Centers | బాబాపూర్​, పల్లికొండ గ్రామాల్లో..

రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని కమ్మర్​పల్లి (Kammarpally) మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాలెపు నర్సయ్య అన్నారు. భీమ్​గల్​ మండలం బాబాపూర్, పల్లికొండ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని కల్లాల్లో ఆరబోసుకొని తగినంత మాయిశ్చర్​ వచ్చాకే విక్రయించాలని సూచించారు. విక్రయించిన స్వల్ప వ్యవధిలోని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుందన్నారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొదిరే స్వామి, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, బీసీ సెల్ అధ్యక్షుడు కోరాడి రాజు, ఎస్టీ సెల్ అధ్యక్షుడు గోపాల్ నాయక్, ఆరేపల్లి నాగేంద్ర, వాక మహేష్, సుంకరి సురేష్, ముచ్కూర్ లింబాద్రి, సేవాలాల్, పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News