Homeజిల్లాలుకామారెడ్డిPaddy Centers | కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

Paddy Centers | కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

అక్షరటుడే, బీర్కూర్​: Paddy Centers | ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని ఐకేపీ ఏపీఎం (IKP APM) శిరీష సూచించారు. బీర్కూర్ (Birkur) మండల పరిధిలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బైరాపూర్(Birapur), కిష్టాపూర్, తిమ్మాపూర్ గ్రామ సంఘాల ఆధ్వర్యంలో కనీస మద్దతు ధరకు రైతుల నుంచి వరి కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

రైతులు ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో బీర్కూర్​ తహశీల్దార్ భుజంగరావు, మండల సమాఖ్య సిబ్బంది, గ్రామ సంఘాల అధ్యక్షులు, గ్రామ సంఘ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Paddy Centers | పెద్దగొడప్​గల్​లో..

అక్షరటుడే, పెద్ద కొడప్​గల్: మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘంలో (Primary Cooperative Society) మంగళవారం వరి కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ సీఈవో సందీప్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,389 నిర్ణయించిందన్నారు.

అలాగే కామన్​ గ్రేడ్​ ధర రూ.2,369 మద్దతు ధరను నిర్ణయించిందని పేర్కొన్నారు. ప్రాథమిక సహకార సంఘం పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రం వల్ల పెద్ద కొడప్​గల్, కాసులాబాద్, సీతారాంపల్లి, శాంతాపూర్ గ్రామాల రైతులకు ఉపయోగపడుతుందన్నారు. రైతులు దళారులకు అమ్మి మోసపోవద్దని.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు.

Paddy Centers