Homeజిల్లాలునిజామాబాద్​Kammarpally | ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: మానాల మోహన్​ రెడ్డి

Kammarpally | ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: మానాల మోహన్​ రెడ్డి

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సహకార యూనియన్​ ఛైర్మన్​ మానాల మోహన్​ రెడ్డి అన్నారు. కమ్మర్​పల్లి మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన ప్రారంభించారు.

- Advertisement -

అక్షరటుడే, కమ్మర్​పల్లి: Kammarpally | ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సహకార యూనియన్​ ఛైర్మన్ మానాల మోహన్​ రెడ్డి (Manala Mohan Reddy) సూచించారు. మండలంలోని అమీర్ నగర్​లో, నర్సాపూర్ ఐకేపీ సెంటర్, కోన సముందర్ గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మానాల మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు (Farmers) తమ ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు (purchase centers)  తరలించి మద్దతు ధరను తీసుకోవాలని సూచించారు. సంచులు, లారీల కోసం రైతులు ఆందోళన చెందవద్దని కోరారు.

కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ పాలెపు నర్సయ్య వైస్ ఛైర్మన్ సుంకెట బుచ్చన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకెట రవి, ఏఎంసీ డైరెక్టర్ జైడి మధులత, శ్రీనివాస్ రాములు నాయక్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పడిగెల ప్రవీణ్, గోపిడి లింగారెడ్డి, నూకల బుచ్చి మల్లయ్య, కొమ్ముల రాజేందర్, భూమారెడ్డి, గంగారెడ్డి, పుప్పాల నర్సయ్య, సంజీవ్, గణేష్, రాకేష్, సామ మహేందర్, సామ భూమారెడ్డి, చెంగల అశోక్, ఐకేపీ సీసీలు పీరియా, రవి, పీఏసీఎస్ స్పెషల్ ఆఫీసర్ బాబూరావు, కార్యదర్శి కార్తీక్ మాజీ ఛైర్మన్ బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.