Homeజిల్లాలునిజామాబాద్​Paddy Centers | ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

Paddy Centers | ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

వరిధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. కలెక్టరేట్​లో శనివారం సహకార సంఘాల ఇన్​ఛార్జీలతో సమీక్ష నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Paddy Centers | వరిధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. కలెక్టరేట్​లో శనివారం సహకార సంఘాల ఇన్​ఛార్జీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని పలు చోట్ల నాట్లు వేయడంలో ఆలస్యమైనందున ధాన్యం దిగుబడును కొంత ఆలస్యంగా వస్తున్నాయన్నారు.

దీన్ని దృష్టిలో పెట్టుకొని మిగిలిన చోట్ల రెండు మూడు రోజుల్లో ధాన్యం సేకరణను పూర్తిచేయాలని ఆదేశించారు. సేకరించిన ధాన్యాన్ని బిల్లులకు తరలించాలని, రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించాలని సూచించారు. కేంద్రాల వద్ద సరిపడా సంఖ్యలో హమాలీలను, లారీలను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. మిల్లుల వద్ద దొడ్డురకం ధాన్యం సైతం సకాలంలో అన్​లోడ్​ చేసుకునేలా చర్యలు తీసుకున్నామని, ఒకవేళ ఎక్కడైనా దిగుమతి చేసుకోకపోతే తమ దృష్టికి తేవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఎస్​వో అరవింద్ రెడ్డి, డీసీవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.