అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేలా చూడాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అధికారులను ఆదేశించారు. ఆయన కామారెడ్డి మండలం (Kamareddy mandal) ఇస్రోజీవాడి, తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామాల్లో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మంగళవారం పరిశీలించారు.
తేమశాతం, తూకం విధానం, ధాన్యం నిల్వల సదుపాయంపై రైతులు, అధికారులను (Farmers and officials) అడిగి తెలుసుకున్నారు. మొక్కజొన్న పంట (maize crop) ద్వారా వచ్చే ఆదాయం వివరాలను రైతుల ద్వారా ఆరా తీశారు. ఓ రైతు కొనుగోలు కేంద్రం వద్ద తన కొడుకుతో కనిపించడంతో పాఠశాలకు ఎందుకు వెళ్లలేదని అడిగారు. పిల్లలను పనికి తీసుకురావద్దని, ప్రతిరోజు పాఠశాలకు పంపించాలని సూచించారు.
Kamareddy Collector | 427 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 427 వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 1,23,993 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఇందులో 59,162 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 64,831 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని 11,196 మంది రైతుల నుంచి సేకరించామన్నారు. రూ.145 కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని చెప్పారు. అలాగే 18 మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేయగా 13 కేంద్రాలను ప్రారంభించినట్లు వివరించారు. వీటి ద్వారా 2149.5 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ (Additional Collector Victor), ట్రెయినీ కలెక్టర్ రవితేజ, డీసీఎస్వో వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్, డీసీవో రామ్మోహన్, ఇతర అధికారులు ఉన్నారు.
