అక్షరటుడే, నిజామాబాద్ : Indalwai Tollgate | ధాన్యం లోడ్‌తో వెళ్తున్న లారీ ఇందల్వాయి టోల్గేట్ (Indalwai Tollgate) వద్ద బుధవారం ఉదయం బోల్తా పడింది. యూ టర్న్ తీసుకుంటున్న క్రమంలో ప్రమాదవశాత్తు లారీ బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు.
సిరికొండ మండలం (Sirikonda Mandal) చీమన్‌పల్లి కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం తీసుకొని లారీ నిజామాబాద్ (Nizamabad)కు బయలు దేరింది. జాతీయ రహదారిపై టోల్గేట్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో ప్రమాదం జరిగింది. దీంతో లారీలోని వడ్ల సంచులు కింద పడిపోయాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ఆ సమయంలో వెనకాల వాహనాలు రాలేదు. లేదంటే పెద్ద ప్రమాదం జరిగేదని స్థానికులు చెప్పారు. అనంతరం మరో లారీలో వడ్ల బస్తాలను తరలించారు.
