Homeజిల్లాలుకామారెడ్డిGPO Association | సమస్యల పరిష్కారానికే జీపీవోల ఆవిర్భావ సభ

GPO Association | సమస్యల పరిష్కారానికే జీపీవోల ఆవిర్భావ సభ

జీపీవోల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికే జీపీవోల ఆవిర్భావ సభ ఏర్పాటు చేయడం జరిగిందని ఆ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ చిరంజీవి ముదిరాజ్ తెలిపారు. పట్టణంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: GPO Association | జీపీవోల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికే జీపీవోల ఆవిర్భావ సభ (GPO formation meeting) ఏర్పాటు చేయడం జరిగిందని ఆ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ చిరంజీవి ముదిరాజ్ తెలిపారు.

పట్టణంలో శనివారం సాయంత్రం ఆయన పట్టణంలోని ఆర్​అండ్​బీ గెస్ట్​హౌస్​లో మీడియాతో మాట్లాడారు. ఈనెల 23న హైదరాబాద్​లోని (Hyderabad) సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గ్రామ పరిపాలన ఉద్యోగ అసోసియేషన్ నూతన ఆవిర్భావ సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జీపీవో ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఈ సభలో చర్చిస్తామన్నారు.

ఈ ఆవిర్భావ సభకు ముఖ్య అతిథులుగా రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.అచ్చిరెడ్డి, డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ హాజరవుతారని పేర్కొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి జీపీవోలు అధికసంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జేపీవోలు మాణిక్యం, సూరజ్ కుమార్, సంజీవులు, అశోక్, భాస్కర్, రాజు, సాయిలు, రవి, సంతోష్ రెడ్డి, ప్రవీణ పాల్గొన్నారు.