అక్షరటుడే, గాంధారి: GPO certify | ఇటీవలే తెలంగాణ Telangana రాష్ట్రంలోని పల్లెల్లో జీపీవోలు అధికార బాధ్యతలు చేపట్టారు. వారికి అప్పుడే పనులు కూడా అప్పజెప్పారు.
ఇకపై కులం, ఆదాయ ధ్రువపత్రాలు పొందాలంటే.. జీపీవో GPO లు ధ్రువీకరిస్తేనే.. తహసీల్దారు కార్యాలయం నుంచి ధ్రువపత్రాలు జారీ చేస్తారు.
ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం government ఉత్తర్వులు కూడా జారీ చేసిందని కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తహసీల్దారు రేణుకా చావన్ తెలిపారు.
GPO certify | ప్రాసెస్ ఇలా..
- ప్రజలు మొదట జీపీవో వద్దకు వెళ్లాలి.
- జీపీవో నుంచి ధ్రువీకరణ తీసుకోవాలి.
- తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
- అటు పిమ్మట ఆ దరఖాస్తు తహసీల్దారు కార్యాలయానికి చేరుకుంటుంది.
- తహసీల్దారు కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ పరిశీలించి, తహసీల్దారు పరిశీలనకు పంపుతారు.
- ఇక చివరగా తహసీల్దారు Tahsildar పరిశీలించి సంతకం చేస్తారు.
- తహసీల్దారు సంతకం పూర్తయ్యాక.. ఆన్లైన్లో ధ్రువపత్రాలను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
GPO certify | కొత్త నిబంధనలు పాటించాలి : రేణుకా చావన్, తహసీల్దారు (గాంధారి)
ప్రభుత్వం కొత్తగా నిబంధనలు తీసుకొచ్చింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఆయా గ్రామాల ప్రజలు తమకు కావాల్సిన ధ్రువపత్రాల కోసం మొదట జీపీవోను సంప్రదించాలి. ఆ తర్వాతే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. లేదంటే వాటిని తిరస్కరించబడతాయి.