అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Transco | విద్యుత్ ఉద్యోగులకు జీపీఎఫ్ వర్తింపజేయాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ (Telangana Power Employees JAC) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని (Rural MLA Bhupathi Reddy) కలిసి వినతిపత్రం అందజేశారు.
1999 –2004 మధ్య నియమితులైన ఉద్యోగులకు జీపీఎఫ్(GPF) వర్తింపజేయాలని, తమ విన్నపాన్ని డిప్యూటీ సీఎం, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ (State Principal Secretary), ట్రాన్స్‌కో ఛైర్మన్/ఎండీ (Transco Chairman) దృష్టికి తీసుకెళ్లాలని ఆయనను కోరారు. దీంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో జేఏసీ ఛైర్మన్ రఘునందన్, కన్వీనర్ బాలేష్ కుమార్, కో–కన్వీనర్ తోట రాజశేఖర్, నాయకులు శ్రీనివాస్, శ్రీరాంమూర్తి, మల్లేష్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.