3
అక్షర టుడే, నిజాంసాగర్: Madnoor mandal | మద్నూర్ మండలంలో గ్రామ పంచాయతీ ట్రాక్టర్లను (gram panchayat tractors) ప్రైవేట్ పనులకు వినియోగిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. మద్నూర్ మండల కేంద్రంలో సీసీ రోడ్డు పనులు (CC road works) జరుగుతున్నాయి. కాగా.. గుత్తేదారు దన్నూర్ గ్రామ పంచాయతీ నీటి ట్యాంకర్ వాడుతున్నారు. ఈ విషయమై పంచాయతీ అధికారులకు వివరణ కోరగా.. రోజుకు రూ.200 చొప్పున అద్దెకు ఇస్తున్నట్లు తెలిపారు. కాగా, ఇలా పంచాయతీ ట్రాక్టర్లను అద్దెకు ఇవ్వడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.