ePaper
More
    HomeతెలంగాణACB Case | రూ.లక్ష లంచం డిమాండ్​.. ఏసీబీ అధికారులను చూసి పరుగు పెట్టిన జీపీ...

    ACB Case | రూ.లక్ష లంచం డిమాండ్​.. ఏసీబీ అధికారులను చూసి పరుగు పెట్టిన జీపీ కార్యదర్శి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Case | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. ప్రజలను లంచాల పేరిట వేధిస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు లంచాలకు మరిగారు. కొందరు అధికారులు డబ్బులు తీసుకోనిదే పనులు చేయడం లేదు. తాజాగా ఓ పంచాయతి కార్యదర్శి (Panchayat Secretary) రూ.50 వేలు లంచం తీసుకున్నాడు. అయితే ఏసీబీ అధికారులు వచ్చారన్న విషయం తెలుసుకున్న ఆయన కారులో పరారయ్యాడు.

    రంగారెడ్డి(Rangareddy) జిల్లా కొత్తూరు మండలం ఇన్మూల్​నర్వ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా కె సురేందర్​ పనిచేస్తున్నాడు. ఇటీవల ఓ వ్యక్తి భవన నిర్మాణం చేపట్టాడు. అయితే సదరు నిర్మాణానికి జీపీ కార్యదర్శి సురేందర్​ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు పక్కన పెట్టడానికి ఆయన రూ.లక్ష లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో శనివారం బాధితుడి నుంచి జీపీ కార్యదర్శి సురేందర్​ రూ.50 వేలు లంచం తీసుకున్నాడు.

    READ ALSO  Operation Muskan | ఆపరేషన్​ ముస్కాన్​లో 7,678 మంది చిన్నారులను రక్షించిన పోలీసులు

    ACB Case | ఏసీబీ అధికారులను చూసి..

    లంచం తీసుకున్న కార్యదర్శి సురేందర్​ ఏసీబీ అధికారులు (ACB Officers) రావడాన్ని గమనించాడు. వెంటనే కారులో డబ్బుతో సహా పరారు అయ్యాడు. అధికారులు గాలించి ఆ వాహనంతో పాటు లంచంగా తీసుకున్న డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు సురేందర్​ కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు.

    ACB Case | లంచం అడిగితే ఫోన్​ చేయండి

    ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)​, వాట్సాప్ నంబర్​ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని తెలుపుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

    READ ALSO  ED Raids | గొర్రెల పంపిణీ స్కాం ఈడీ సంచలన ప్రకటన.. రూ.వెయ్యి కోట్ల అవినీతి..!

    Latest articles

    Coolie Trailer | సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ట్రైల‌ర్ విడుద‌ల‌.. విల‌న్‌గా మారి అద‌ర‌గొట్టిన కింగ్‌ నాగార్జున

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Coolie Trailer | సూపర్‌స్టార్ రజినీకాంత్ (Super Star Rajinikanth) సినిమా వస్తోంది అంటే...

    ENGvIND | ఇంగ్లండ్ బౌల‌ర్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించిన జైస్వాల్, ఆకాశ్.. భార‌త్ ఆధిక్యం ఎంతంటే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ENGvIND | ఇంగ్లండ్‌తో జరుగుతున్న అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ (Anderson-Tendulkar Trophy) చివరి టెస్టు (ఓవల్...

    Kamareddy SP | పగలు ఐస్​క్రీంలు అమ్ముతూ.. రాత్రిళ్లు చోరీలు చేస్తూ..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | పగలంతా ఐస్ క్రీములు అమ్మి రెక్కీ నిర్వహిస్తూ.. రాత్రుళ్లు చోరీలకు పాల్పడుతున్న...

    Hydraa | వాళ్లే హైడ్రాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. కమిషనర్​ రంగనాథ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో అక్రమ నిర్మాణాలు కూల‌గొట్టడం మాత్రమే కాదని, ప‌ర్యావ‌ర‌ణ...

    More like this