అక్షరటుడే, నిజాంసాగర్: Pitlam | అనుమానాస్పద స్థితిలో పంచాయతీ కార్యదర్శి మృతి చెందిన ఘటన పిట్లం మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం మండలం స్కూల్ తండా పంచాయతీ పరిధిలోని పోతిరెడ్డి పల్లి తండాకు చెందిన కృష్ణ.. చిన్నకొడప్గల్ జీపీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అయితే కృష్ణ రెండురోజులుగా అదృశ్యమయ్యాడు. శనివారం ఆయన మృతదేహం చిన్న కొడప్గల్ రెడ్డి చెరువులో లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆయన తలపై గాయాలున్నాయని.. ఎవరైనా హత్యచేసి చెరువులో పడేశారేమోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
