HomeUncategorizedPiyush Goyal | స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాల‌కు ఓకే.. దేశీయ ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టు పెట్ట‌బోమ‌న్న గోయ‌ల్‌

Piyush Goyal | స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాల‌కు ఓకే.. దేశీయ ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టు పెట్ట‌బోమ‌న్న గోయ‌ల్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Minister Piyush Goyal | వ్యవసాయం, ఆటోమొబైల్స్ సమస్యలపై ఇండియా, అమెరికా మధ్య జ‌రుగుతున్న చర్చలు సంక్లిష్టంగా మారుతున్న తరుణంలో కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ కీల‌క (Union Commerce Minister Piyush Goyal) వ్యాఖ్య‌లు చేశారు. దేశీయ ప్ర‌యోజనాలు దెబ్బతీసే ఓ వాణిజ్య ఒప్పందానికి ఇండియా అంగీక‌రించ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాలు కాపాడేలా స‌మతుల్యంగా ఉండాల‌ని పునరుద్ఘాటించారు. శ్రీ‌న‌గ‌ర్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. “ఎఫ్‌టీఏ అనేది రెండు వైపులా వాణిజ్యం. మీరు మా మార్కెట్‌ను తెరవమని అడగలేరు కానీ భారతీయ ఉత్పత్తులను (Indian products) అంగీకరించడానికి నిరాకరించలేరు” అని గోయల్ తెలిపారు. వాణిజ్యం రెండు వైపులా పని చేయాల్సి ఉంటుంద‌ని నొక్కి చెప్పారు.

Piyush Goyal | దేశ ప్ర‌యోజ‌నాల‌కే ముఖ్యం..

ఏ దేశంతో వాణిజ్య ఒప్పందాలైనా (trade agreement) ముందుగా దేశీయ ప్ర‌యోజ‌నాల‌కే ప్రాధాన్యం ఇస్తామ‌ని గోయ‌ల్ తెలిపారు. నరేంద్ర మోదీ (PM Narendra Modi) నేతృత్వంలోని ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యత జాతీయ ప్రయోజనాలను కాపాడడమేనని చెప్పారు. “వ్యాపారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మేము ఏ FTAపై సంతకం చేసినా అది జమ్మూ&కశ్మీర్ స‌హా మొత్తం దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే చేస్తామ‌ని” ఆయన పేర్కొన్నారు.

Piyush Goyal | వోక‌ల్ ఫ‌ర్ లోక‌ల్‌..

మోదీ ప్ర‌భుత్వం లోక‌ల్‌కు ప్రాధాన్య‌త‌నిస్తుంద‌ని, మేడిన్ ఇండియా త‌మ నినాద‌మ‌ని చెప్పారు. “మేము ‘వోకల్ ఫర్ లోకల్’ను (Vocal for Local) ప్రోత్సహిస్తున్నాము. అదే స‌మ‌యంలో లోక‌ల్ నినాదం ప్రపంచవ్యాప్తంగా ఉండేలా చూసుకుంటున్నాము. మా విధానం ‘మేక్ ఇన్ ఇండియా’, అలాగే ‘మేక్ ఫర్ ది వరల్డ్’ రెండింటికీ మద్దతు ఇస్తుంది” అని గోయల్ వివ‌రించారు.

Read all the Latest News on Aksharatoday.in