HomeతెలంగాణGovt Employees | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉద్యోగుల సమస్యలపై కమిటీ

Govt Employees | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉద్యోగుల సమస్యలపై కమిటీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Govt Employees | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సమస్యలపై అధికారుల కమిటీ ఏర్పాటు చేసింది. పీఆర్​సీ(PRC)తో పాటు తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగులు(Government Employees) కొంతకాలంగా డిమాండ్​ చేస్తున్నారు. అయితే ఉద్యోగుల డిమాండ్లపై స్పందిస్తూ సీఎం రేవంత్​రెడ్డి(Cm revanth reddy) సోమవారం చేసిన వ్యాఖ్యలపై బీఆర్​ఎస్​, బీజేపీ మండిపడ్డాయి. రాష్ట్రం దివాళా తీసిందని, అప్పు పుట్టడం లేదని ఉద్యోగుల డిమాండ్లు ఇప్పుడు నెరవేర్చలేమని సీఎం అన్నారు.

బీజేపీ, బీఆర్​ఎస్​ నాయకులు రేవంత్​రెడ్డికి కౌంటర్​ ఇచ్చారు. పాలన చేతగాక అలాంటి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం వ్యాఖ్యలు జనంలోకి నెగెటివ్​గా వెళ్లడంతో కాంగ్రెస్​ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఉద్యోగుల సమస్యలపై కమిటీ వేస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాలతో ఈ కమిటీ చర్చించనుంది. ఈ కమిటీలో ముగ్గురు సీనియర్ ఐఏఎస్​లు సభ్యులుగా ఉంటారు. నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణభాస్కర్ నేతృత్వంలోని ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.