Governor Jishnu Dev Verma
Governor Jishnu Dev Verma | రేపు జిల్లాకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రాక

అక్షరటుడే, ఇందూరు: Governor Jishnu Dev Verma | రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఈనెల 16న జిల్లాకు రానున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ముందుగా హైదరాబాద్ (Hyderabad)​ నుంచి డిచ్​పల్లి 7వ పోలీస్ బెటాలియన్​కు చేరుకుంటారు.

Governor Jishnu Dev Verma | తెలంగాణ యూనివర్సిటీలో..

అక్కడి నుంచి తెలంగాణ విశ్వవిద్యాలయంలో (Telangana University) జరిగే రెండవ స్నాతకోత్సవ (Graduation ceremony) కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్న భోజన అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​కు చేరుకుంటారు. అక్కడ జిల్లా అధికారులు, కవులు, కళాకారులు, జాతీయ, రాష్ట్ర అవార్డు గ్రహీతలతో ముచ్చటిస్తారు. అనంతరం జిల్లా టీబీ అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ(Red Cross Society) ప్రతినిధులతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు.