అక్షరటుడే, డిచ్పల్లి: Governor Jishnu Dev Verma | తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) పీహెచ్డీ, గోల్డ్ మెడలిస్ట్‌లకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పట్టాలను ప్రదానం చేశారు. యూనివర్సిటీ పరిధిలో మొత్తంగా 157 మంది పీహెచ్‌డీలు, గోల్డ్‌మెడళ్లు సాధించారు. పట్టాలు అందుకున్న వారు ఈ సందర్భంగా గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Governor Jishnu Dev Verma | ఉన్నతాధికారుల ఘనస్వాగతం..
గవర్నర్ బుధవారం ఏడో బెటాలియన్‌కు చేరుకున్నారు. దీంతో రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి(Rajya Sabha member Suresh Reddy), కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna Reddy), సీపీ సాయి చైతన్య(CP Sai Chaitanya), ట్రెయినీ కలెక్టర్ చింగ్తియాన్మావి (Trainee Collector Chingtianmavi), తెయూ వీసీ యాదగిరి (TU VC Yadagiri) తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం గవర్నర్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. బెటాలియన్ గెస్ట్‌హౌస్‌లో మొక్కలు నాటారు. అనంతరం ప్రత్యేక కాన్వాయ్‌లో తెలంగాణ యూనివర్సిటీకి చేరుకున్నారు. స్నాతకోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. అనంతరం పీహెచ్డీ, గోల్డ్ మెడలిస్ట్‌లకు డాక్టరేట్లు అందజేశారు.
Governor Jishnu Dev Verma | కట్టుదిట్టమైన ఏర్పాట్లు..
గవర్నర్ పర్యటన సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సీపీ సాయిచైతన్య భద్రతను పర్యవేక్షించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. యూనివర్సిటీలో కార్యక్రమం ముగించుకుని నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరారు. కార్యక్రమంలో స్నాతకోత్సవ ముఖ్య అతిథి శ్రీవారి చంద్రశేఖర్, రిజిస్టర్ ప్రొఫెసర్ యాదగిరి, ఉపకులపతి టి.యాదగిరి రావు అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గవర్నర్ జిష్టుదేవ్ వర్మ చేతుల మీదుగా పట్టాలు అందుకుంటున్న దృశ్యం