Telangana University
Telangana University | తెయూ స్నాతకోత్సవానికి రావాలని గవర్నర్​కు ఆహ్వానం

అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ యూనివర్సిటీ వైస్​ ఛాన్స్​లర్​ యాదగిరిరావు సోమవారం రాష్ట్ర గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మను (Governor Jishnu Dev Verma) కలిశారు. ఈ సందర్భంగా వర్సిటీలో ఈనెల మూడోవారంలో జరుగనున్న విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి (University Graduation Ceremony) రావాలని ఆయనను ఆహ్వానించారు. అనంతరం గవర్నర్​ మాట్లాడుతూ.. నాణ్యమైన విద్య ద్వారానే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో అనేక సహజ వనరులు ఉన్నాయని వాటిని వెలికితీసే దిశగా వివిధ రంగాల్లో లోతైన పరిశోధనలు జరగాలని గవర్నర్​ ఆకాంక్షించారు.