ePaper
More
    HomeతెలంగాణTeachers | ప్రభుత్వం కీలక నిర్ణయం.. టీచర్ల సర్దుబాటుకు అనుమతి

    Teachers | ప్రభుత్వం కీలక నిర్ణయం.. టీచర్ల సర్దుబాటుకు అనుమతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Teachers | తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో (Govt Schools) ఉపాధ్యాయుల సర్దుబాటు (Teachers Adjustment)కు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. మరి కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు లేకున్నా.. ఎక్కువ సంఖ్యలో టీచర్లు ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం టీచర్లను సర్దుబాటు చేయాలని ఆదేశించింది.

    మరి కొద్ది రోజుల్లో పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రభుత్వం సర్కార్​ బడుల బలోపేతం కోసం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే అదనంగా ఉన్న టీచర్లను అవసరమున్న స్కూళ్లలో సర్దుబాటు చేసేందుకు వీలు కల్పించింది. కలెక్టర్ల(Collectors)కు సర్దుబాటు అధికారం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే టీచర్లు ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాల్లోనే సర్దుబాటుకు అవకాశం కల్పించింది.

    Teachers | మళ్లీ దందాకు తెర లేపుతారా..?

    ప్రభుత్వం ఏటా టీచర్ల సర్దుబాటుకు అవకాశం కల్పిస్తుంది. విద్యార్థులు అధికంగా ఉండి ఉపాధ్యాయులు లేని బడులకు టీచర్లను సర్దుబాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. అయితే జిల్లాల పరిధిలో జరిగే ఈ వ్యవహారంలో ఏటా అక్రమాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా పలు ఉపాధ్యాయ సంఘాల (Teachers Union) లీడర్లు చక్రం తిప్పుతారు. అవసరం ఉన్న చోట కాకుండా నచ్చిన చోట పోస్టింగ్​ ఇప్పిస్తారు.

    ఈ వ్యవహారంలో భారీ ఎత్తున డబ్బులు కూడా గతంలో చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ సారి సర్దుబాటు ప్రక్రియ ఎలా చేపడుతారో చూడాలి. ముఖ్యంగా మారుముల గ్రామాల పాఠశాలలకు వెళ్లడానికి ఉపాధ్యాయులు సుముఖత చూపరు. వారు అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు సర్దుబాటు చేయించుకోవడానికి యత్నిస్తారు. అలా కాకుండా అవసరం మేరకే ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

    Latest articles

    Commonwealth Games | కామ‌న్వెల్త్ క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌కు భార‌త్ రెడీ.. బిడ్ వేసేందుకు కేంద్రం అనుమ‌తి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Commonwealth Games : కామ‌న్వెల్త్ క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. ఈ మేర‌కు 2030...

    Pm modi | ట్రంప్‌నకు షాకిచ్చిన మోడీ.. నాలుగుసార్లు ఫోన్​ చేసినా లిఫ్ట్ చేయ‌ని ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pm modi | భార‌త్‌పై 50 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్...

    rehabilitation center | మర్పల్లికి వరద తాకిడి.. పునరావాస కేంద్రానికి ప్రజల తరలింపు

    అక్షరటుడే, నిజాంసాగర్​: rehabilitation center | నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నిజాంసాగర్ మండలం మర్పల్లి గ్రామంలోకి...

    Heavy rains | కామారెడ్డిలో వర్ష బీభత్సం.. డ్రోన్​ చిత్రాలు..

    అక్షరటుడే, కామారెడ్డి: Heavy rains | కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం తీవ్ర ఆందోళనకర పరిస్థితి సృష్టించింది. జిల్లా...

    More like this