అక్షరటుడే, వెబ్డెస్క్ : Fee reimbursement | ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్పై అధ్యయనానికి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది.
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయిన విషయం తెలిసిందే. ప్రైవేట్ కాలేజీల (Private College) యాజమాన్యాలకు దాదాపుగా రూ.10 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం కొంతకాలంగా నిధులు విడుదల చేయడం లేదు. గతంలో యాజమాన్యాలు బంద్కు పిలుపునివ్వగా ప్రభుత్వం చర్చలు జరిపి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అయితే నిధులు ఎంతకు విడుదల చేయకపోవడంతో ప్రస్తుతం కాలేజీలు బంద్ పాటిస్తున్నాయి. రీయింబర్స్మెంట్ చెల్లించే వరకు కాలేజీలు మూసి వేస్తామని ప్రకటించాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం.
Fee reimbursement | మూడు నెలల్లో నివేదిక
రీయింబర్స్మెంట్ చెల్లింపులు, మార్పులకు సంబంధించి ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. ఛైర్మన్గా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీని నియమించింది. వైస్ ఛైర్మన్గా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉంటారు. వివిధ శాఖల కార్యదర్శులను సభ్యులుగా నియమించింది. వీరితో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ (Professor Kodandaram), కంచె ఐలయ్య (Kanche Ailaiah)లను సైతం మెంబర్లుగా చేరింది. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల సంఘం నుంచి ముగ్గురు సభ్యులు ఉంటారు. అయితే ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ గత నెల 28న జీవో జారీ చేసింది. దానిని తాజాగా బయట పెట్టడం గమనార్హం. మూడు నెలల్లో కమిటీ నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఫీజు రీయింబర్స్మెంట్ పాలసీపై అధ్యయనం చేసి సూచనలు ఇవ్వాలని పేర్కొంది. ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి, దాని ద్వారా ఈ పథకం చెల్లింపులు చేయడంపై పరిశీలలించాలని సూచించింది. అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల సూచనలపై సైతం అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.