Homeతాజావార్తలుEndowment Lands | ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆలయాల భూముల రక్షణకు చర్యలు

Endowment Lands | ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆలయాల భూముల రక్షణకు చర్యలు

రాష్ట్రంలోని ఆలయాల భూముల రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టడానికి కసరత్తు చేస్తోంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Endowment Lands | రాష్ట్రంలోని దేవాదాయ భూముల రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏపీ ఎండోమెంట్ యాక్ట్ 1987 సవరణకు కసరత్తు చేస్తోంది. అందులోని సెక్షన్ 83, 84 తొలగించాలని నిర్ణయించింది.

రాష్ట్రంలో ఆలయాలకు వేలాది ఎకరాల భూములు ఉన్నాయి. అయితే చాలా వరకు ఆలయ భూములు కబ్జాలకు గురవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, భూములు అక్కడక్కడ ఉండటంతో పలువురు ఆక్రమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆలయ భూములను రక్షించాలని తెలంగాణ సర్కార్​ నిర్ణయించింది. ఏపీ ఎండోమెంట్ యాక్ట్ (Endowment Act), 1987 చాప్టర్ XI సవరణ చేసి కబ్జాలకు పాల్పడే వారి ఆట కట్టించాలని భావిస్తోంది. ఈ మేరకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) బిల్లు పెట్టడానికి సిద్ధం అవుతోంది.

Endowment Lands | హైదరాబాద్​ పరిధిలో..

రాష్ట్రంలో ఆలయ భూములకు రక్షణ లేకుండా పోయింది. ముఖ్యంగా హైదరాబాద్​ (Hyderabad) నగరం పరిధిలో వందల ఎకరాలు, భవనాల ఆక్రమణకు గురయ్యాయి. నగరంలో భూముల రేట్లు భారీగా ఉండటంతో అక్రమార్కులు చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములతో పాటు దేవుడి భూములను సైతం కబ్జా చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం (State Government) ఆక్రమణలకు గురైన ఆస్తులను వెనక్కి తీసుకోనుంది. పోలీస్, హైడ్రా సాయంతో ఆక్రమణల తొలగింపునకు కసరత్తు చేస్తోంది. ట్రిబ్యునల్, కోర్టు కేసులతో వేల ఎకరాలు కబ్జా చేస్తున్న వాళ్ల ఆటకట్టించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేవాలయ, చారిటబుల్ సంస్థలకు చెందిన భూములు, భవనాల్ని ఎవరు ఆక్రమించినా వెనక్కి తీసుకు వచ్చేలా చట్టం తేనుంది.

Must Read
Related News