అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Compensation | భారీ వర్షాలు (Heavy Rains) ఇటీవల బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఆగస్టు 26న రాత్రి నుంచి 28 వరకు కుండపోత వానలు కురిశాయి.
రాష్ట్రంలోని కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో వర్షాల ప్రభావం అధికంగా ఉంది. ముఖ్యంగా వినాయక చవితి రోజు అతి భారీ వర్షాలు కురవడంతో వరద పోటెత్తింది. చాలా గ్రామాలు నీట మునిగాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది. వరదల దాటికి పలువురు మృతి చెందారు. పశువులు సైతం నీట మునిగి చనిపోయాయి.
Compensation | అండగా ప్రభుత్వం
భారీ వరదలతో (Floods) మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఉండగా నిలవాలని నిర్ణయించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Reavanth Reddy) ఆదేశించారు. అలాగే వరదలకు మృతి చెందిన పశువులకు సైతం పరిహారం ఇవ్వాలన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం ఆదేశించారు. మళ్లీ భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమగ్ర నివేదిక కేంద్రానికి అందజేయాలని ఆయన సూచించారు.
గతేడాది భారీ వర్షాలకు జరిగిన నష్టానికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు రాకపోవడంపై సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆరా తీశారు. తక్షణమే కేంద్రం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలన్నారు. భారీ వర్షాల సమయంలో చెరువులకు నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.
Compensation | పలువురు మృతి
వరదలతో పలువురు మృతి చెందారు. మెదక్ (Medak) జిల్లా హవేలి ఘన్పూర్ మండలం రాజ్పేట గ్రామానికి చెందిన ఇద్దరు వాగులో కొట్టుకుపోయి చనిపోయారు. కామారెడ్డిలో సైతం పలువురు మృతి చెందారు. అలాగే మెదక్ జిల్లా దూప్సింగ్ తండాలో పశువులు వరదకు కొట్టుకుపోయాయి. రాజంపేట మండలంలోని పలు తండాల్లో సైతం పశువులు వాగులో కొట్టుకుపోయాయి. ఈ మేరకు బాధితులకు ప్రభుత్వం పరిహారం అందించాలని నిర్ణయించింది.