అక్షరటుడే, ఇందల్వాయి: Mla Bhupathi reddy | కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (Rural MLA Bhupathi Reddy) పేర్కొన్నారు. నగరంలోని ఒకటో డివిజన్ పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు (Indiramma houses) ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో (Indiramma Rajyam) మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. మహిళల కోసం ఇందిరమ్మ ఇళ్లు, ఉచితం బస్సు ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. 200 యూనిట్ల ఉచిత కరెంటు, సోలార్ ప్లాంట్లు, డ్వాక్రా గ్రూపుల ద్వారా వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఇందిరా మహిళా శక్తి (Indira Mahila Shakti) ద్వారా రుణాలు ఇచ్చి బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అలాగే సోలార్ ప్లాంట్లను పెట్టుకుని విద్యుత్‌ను ప్రభుత్వానికి అద్దెకు ఇవ్వాలని, ప్రభుత్వమే మహిళలకు డబ్బులు చెల్లిస్తుందని అన్నారు.
Mla Bhupathi reddy | బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఈ పథకాలు ఉన్నాయా..?
దేశంలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లు, రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రైతుభరోసా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు ఉన్నాయా అని ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రశ్నించారు. గత ప్రభుత్వం కేసీఆర్ కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కూలిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) కట్టిన ప్రాజెక్టులన్నీ ఇప్పటివరకు ఎటువంటి సమస్య లేకుండా ఉన్నాయన్నారు. ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
Mla Bhupathi reddy | ఖాన్పూర్కు రూ. 12 కోట్లు
ఖానాపూర్ గ్రామానికి రూ.12 కోట్ల నిధులను కేటాయించి, రోడ్లు, అంగన్వాడీ భవన్, మహిళా భవన్, వంటివి కట్టించామని ఎమ్మెల్యే వివరించారు. ప్రస్తుతం ఖానాపూర్ కాలూర్ గ్రామాలకు కలిపి 86 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని చెప్పారు.
సమావేశంలో ఏఎంసీ ఛైర్మన్ ముప్పా గంగారెడ్డి, ఫిషరీస్ ఛైర్మన్ శ్రీనివాస్, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంగోపాల్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, ఖానాపూర్ డివిజన్ అధ్యక్షుడు రాజేందర్, మాజీ కార్పొరేటర్ కోర్వ గంగాధర్, ఏఎంసీ డైరెక్టర్లు బాగారెడ్డి, రాజలింగం, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఎల్లయ్య, సీనియర్ నాయకులు బాగారెడ్డి, అగ్గు భోజన్న, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.