Homeజిల్లాలునిజామాబాద్​CITU Nizamabad | అంగన్​వాడీలపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు

CITU Nizamabad | అంగన్​వాడీలపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు

అంగన్​వాడీ టీచర్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని సీఐటీయూ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: CITU Nizamabad | అంగన్​వాడీలకు (Anganwadi teachers) ఉద్యోగ భద్రత కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపించట్లేదని సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులు శంకర్ గౌడ్, నూర్జహాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో అంగన్​వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా మహాసభ నిర్వహించారు.

ఈ సందర్భంగా వారిద్దరు మాట్లాడుతూ అంగన్​వాడీ ఉద్యోగులు, స్కీం వర్కర్లను ఉద్యోగులుగా కార్మికులుగా గుర్తించకపోవడంతో ఉద్యోగ భద్రత లేకుండాపోయిందన్నారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. కార్మిక చట్టాలు వర్తించక శ్రమదోపిడీకి గురవుతున్నారని తెలిపారు.

పదవీవిరమణ పొందిన అంగన్​వాడీ ఉద్యోగులకు రిటైర్మెంట్, బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షుడు రమేష్ బాబు, యూనియన్ జిల్లా నాయకులు చంద్రకళ, మంగాదేవి, సూర్యకళ, రాజ్యలక్ష్మి, వాణి, గోదావరి, జ్యోతి, జగదాంబ పాల్గొన్నారు.