అక్షరటుడే, డోంగ్లి: Crop Damage | ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మండలంలో 3,200 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని డోంగ్లి (Dongli) మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు గజానంద్ దేశాయ్ పేర్కొన్నారు.
ఈ మేరకు మంగళవారం వరదల కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పంటనష్టంపై ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు (Mla Thota laxmi kantha Rao) అధికారులతో సమీక్షలు నిర్వహించారన్నారు.
మండల నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో నష్టపోయిన పంట పొలాలకు ఎమ్మెల్యే ఇదివరకే పరిశీలించారన్నారు. నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా తప్పిపోకుండా నిర్దిష్టమైన ప్రణాళికతో నివేదికలు అందించాలని ఆదేశించారన్నారు.
ఎమ్మెల్యే ఆదేశాల మేరకు తాము వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలనకు వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు ప్రభుత్వం ఆదుకుంటుందని నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. మాజీ ఎంపీటీసీ దీన్ దయాల్, నాయకులు గైక్వాడ్ విలాస్, ఏఈవో గజానంద్, మండల రైతులు తదితరులున్నారు.