అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kavitha | గ్రూప్–1 అభ్యర్థులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం గన్‌పార్క్ వద్ద నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వంపై మండిపడ్డారు.గ్రూప్–1 అభ్యర్థులకు మద్దతుగా చేపట్టిన ధర్నాలో కవిత(Kavitha) మాట్లాడారు.
నిరుద్యోగుల గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌లో కొందరికి ఉద్యోగాలు ఇవ్వడానికి గ్రూప్–1 పరీక్ష(Group 1 Exam) పెట్టారా అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు వాళ్లనే మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kavitha | పేపర్లు బయట పెట్టాలి
గ్రూప్–1 పరీక్ష రాసిన అభ్యర్థులు.. ఉద్యోగాలు వచ్చిన వారి పేపర్లు బయట పెట్టాలని కోరుతున్నారని కవిత అన్నారు. ఆ మేరకు వారి పేపర్లు బయట పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం హయాంలో వెలువడిన నోటిఫికేషన్లకు సంబంధించి 50 వేల ఉద్యోగాలు ఇచ్చి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) తామే ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. గ్రూప్–1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని గురువారం రేపు ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఉద్యోగాలు వచ్చిన అభ్యర్థులపై తమకు కోపం లేదని ఆమె పేర్కొన్నారు. అయితే అక్రమంగా తెచ్చుకున్న వారిపైనే కోపమని స్పష్టం చేశారు.
Kavitha | అనేక అక్రమాలు జరిగాయి
పలువురు నిరుద్యోగులు మాట్లాడుతూ.. గ్రూప్–1 పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ధనవంతుల పిల్లలకే ఉద్యోగాలు వచ్చాయన్నారు. ప్రైవేట్ అధ్యాపకులతో పేపర్లను దిద్దించారన్నారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రూప్–1 పరీక్షలు మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామన్నారు. కోర్టులో కేసు విచారణ ఉండగా నియామక పత్రాలు అంత హడావుడిగా ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.
1 comment
[…] జాగృతి పోరాటం చేస్తుందని కవిత (Kavitha)తెలిపారు. అన్ని వర్గాలను […]
Comments are closed.