అక్షరటుడే, ఇందూరు: Government Teachers Union | ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం నిజామాబాద్ అర్బన్ సౌత్, నార్త్ మండలాల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు బుధవారం వివరాలు వెల్లడించారు. సంఘం సౌత్ అధ్యక్షుడిగా గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా ఖాజా నసీరుద్దీన్, ఉపాధ్యక్షుడిగా చందు, సంయుక్త కార్యదర్శిగా నవీన్, ఎండీ ఫజల్, కోశాధికారిగా అనిల్, మహిళా అధ్యక్షురాలుగా సుచిత్రను ఎన్నుకున్నారు.
అలాగే నార్త్ మండల అధ్యక్షుడిగా నాగారావు, ప్రధాన కార్యదర్శిగా ఫజరుల్లా ఖాన్, ఉపాధ్యక్షులుగా నగేష్, ఇర్ఫాన్ సంయుక్త కార్యదర్శిగా సాయిలు, మహిళా అధ్యక్షురాలిగా రాణా తపస్సు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులతో జిల్లా అధ్యక్షుడు సాయిరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో టీఆర్టీయూ తెలంగాణ గౌరవాధ్యక్షుడు కృపాల్ సింగ్ పాల్గొన్నారు.