అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | రామారెడ్డి మండలం పోసానిపేట ప్రభుత్వ పాఠశాలలో (Posanipet Government School) ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మహమ్మద్ షకీల్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందాడు. కామారెడ్డి పట్టణానికి (Kamareddy Town) చెందిన షకీల్ చిన్న వయస్సులోనే కుటుంబ బాధ్యతలు చేపట్టి, కష్టపడి పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తూనే చదువుకున్నాడు.
Kamareddy | ఉస్మానియా నుంచి గోల్డ్ మెడల్ సాధించి..
ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University) నుంచి ఎంఏ హిందీలో గోల్డ్ మెడల్ సాధించాడు. తర్వాత మౌలానా ఆజాద్ కేంద్రీయ ఉర్దూ విశ్వవిద్యాలయం నుండి ఎంఫిల్ చేశాడు. 2012లో హిందీ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని సాధించి తన చదువును ఆపకుండా ముందుకు సాగాడు. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి హిందీలో పీహెచ్‌డీ పట్టా సాధించాడు. విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ హిందీ విభాధ్యక్షురాలు ప్రొఫెసర్ మాయదేవి మార్గదర్శకత్వంలో ఈ డాక్టరేట్ పూర్తి చేశాడు.
Kamareddy | చదువే జీవితానికి మార్గదర్శకం..
ఈ సందర్భంగా షకీల్ మాట్లాడుతూ.. చదువు మన జీవితానికి మార్గదర్శకమన్నారు. కష్టాలు ఎదురైనా, స్వయం ప్రయత్నాలతో ఏదైనా సాధ్యమేనని తన అనుభవాన్ని పంచుకున్నారు. పీహెచ్‌డీ పట్టా (PhD degree) పొందిన సందర్భంగా తోటి ఉపాధ్యాయులు, మిత్రులు, కుటుంబ సభ్యులు షకీల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

