అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Medak | అప్పుల పేరిట వేధింపులకు పాల్పడటంతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు (Govt Teacher) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్‌లో చోటు చేసుకుంది.
మెదక్ (Medak) జిల్లా కేంద్రానికి చెందిన కాముని రమేశ్ (54) హవేలి ఘన్పూర్ మండలం సర్దన ఉన్నత పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నాడు. మేడ్చల్‌లోని ఓ లాడ్జీలో ఆయన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనంతరం బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Medak | మిత్ర దోహం చేశారు
తాను గతంలో కొందరి దగ్గర అప్పులు చేసినట్లు రమేశ్ పేర్కొన్నారు. తన ఆస్తులు, ఇల్లు, భార్య నగలు అమ్మి వాటిని చెల్లించినట్లు చెప్పాడు. అయితే తన మిత్రులు కొందరు మోసం చేశారని వాపోయాడు. తాను డబ్బులు చెల్లించినా.. వారి దగ్గర ఉన్న చెక్కులు, ప్రామిసరీ నోట్లతో తనపై కేసులు వేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుటుంబాన్ని రోడ్డున పడేశారని విలపిస్తూ చెప్పాడు. తాను ఎవరికి బాకీ లేనన్నాడు. కొందరు తనను మానసికంగా వేధించారని చెప్పాడు.
పబ్బ భార్గవ్ అనే వ్యక్తి గతంలో తనను చంపడానికి కూడా యత్నించాడన్నాడు. సంగమేశ్వర్, మహిపాల్‌రెడ్డి, రాములు, కిరణ్‌గౌడ్, భార్గవ్ గౌడ్ వేధింపులతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియోలో పేర్కొన్నాడు. వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాడు. తాను ఎవరిని మోసం చేయలేదని, ఒక్కరికి కూడా రూపాయి బాకీ లేనని చెప్పాడు. తన కుటుంబానికి హానీ తలపెట్టకుండా చూడాలని ఆయన కోరాడు.
Medak | పాఠశాల అభివృద్ధికి చర్యలు
రమేశ్ ఉపాధ్యాయుడిగా పాఠాలు బోధించడంతో పాటు తాను పని చేసిన పాఠశాలల అభివృద్ధికి చర్యలు చేపట్టేవాడు. ఆయన ఓ ఉపాధ్యాయ సంఘం నాయకుడిగా కూడా పని చేశాడు. గతంలో ఆయన బూర్గుపల్లి గ్రామంలో పని చేశాడు. అనంతరం బదిలీపై సర్దన వెళ్లాడు. బూర్గుపల్లిలో పని చేసిన సమయంలో దాతల సాయంతో బడిలో వాటర్ ప్లాంట్ (Water Plant) ఏర్పాటు చేయించాడు. అంతేగాకుండా వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టాడు. ఆయన మృతిపై తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు సంతాపం తెలుపుతున్నారు.