kalemshwaram
Kaleshwaram Project | ప్రభుత్వం కీలక నిర్ణయం.. మేడిగడ్డపై విచారణకు సిద్ధం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kaleshwaram Project | మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) కుంగిన ఘటనపై ప్రభుత్వం విచారణకు సిద్ధమైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్​లో అక్రమాలు, అవినీతి నిగ్గు తేల్చేందుకు ఇప్పటికే కాళేశ్వరం కమిషన్​(Kaleshwar Commission)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్​ దాదాపు 200 మంది అధికారులను విచారించింది. అంతేగాకుండా మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR)​, అప్పటి మంత్రులు హరీశ్​రావు(Harish Rao), ఈటల రాజేందర్(Eetala Rajender)​ను సైతం కమిషన్​ విచారించింది. విచారణ ప్రక్రియ పూర్తవడంతో కమిషన్ ఛైర్మన్ ​ పీసీ ఘోష్​ ఈ నెలాఖరు వరకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.

Kaleshwaram Project | క్రిమినల్ చర్యలకు యోచన

కాళేశ్వరం ప్రాజెక్ట్​(Kaleswaram Project)లో కీలకమైన మేడిగడ్డ కుంగిన విషయం తెలిసిందే. బ్యారేజీలోని పలు పిల్లర్లకు పగుళ్లు వచ్చాయి. కుంగుబాటుకు కారణమైన వారిపై చర్యలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిదంట. క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని ఇప్పటికే విజిలెన్స్​ నివేదిక ఇచ్చింది. దీంతో ఈ ఘటనకు బాధ్యులపై కొందరిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని, మరికొందరికి షోకాజ్ నోటీసులు(Show Cause Notices) ఇవ్వాలని ఇరిగేషన్ శాఖ నిర్ణయించింది.

Kaleshwaram Project | మంత్రి ఉత్తమ్​ చర్చలు

మేడిగడ్డ కుంగుబాటుపై చర్యలు చేపట్టేందుకు ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా(Rahul Bojja), ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్​(Prashant Jeevan)తో మంత్రి ఉత్తమ్ చర్చలు జరిపారు. తదుపరి కార్యాచరణ బాధ్యతను సలహాదారు ఆదిత్యనాథ్ దాస్​కు అప్పగించారు. అయితే ఎవరిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేస్తారనే విషయం తెలియాల్సి ఉంది. ప్రాజెక్ట్​ పనులు చూసిన అధికారులపై కేసు పెడతారా.. లేక కాంట్రాక్ట్​ తీసుకన్న కంపెనీ పెడతారా అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.