Homeతాజావార్తలుMir Alam Tank | ప్రభుత్వం కీలక నిర్ణయం.. మీర్‌ ఆలం ట్యాంక్‌పై వంతెన నిర్మాణానికి...

Mir Alam Tank | ప్రభుత్వం కీలక నిర్ణయం.. మీర్‌ ఆలం ట్యాంక్‌పై వంతెన నిర్మాణానికి అనుమతి

హైదరాబాద్​ నగరంలోని మీర్​ ఆలం ట్యాంక్​పై ప్రభుత్వం ఐకానిక్​ వంతెన నిర్మాణం చేపట్టనుంది. దీనికి సంబంధించిన టెండర్లు తాజాగా ఖరారు అయ్యాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mir Alam Tank | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్​ నగరంలోని మీర్​ ఆలం ట్యాంక్​పై ఐకానిక్​ వంతెన నిర్మాణానికి టెండర్లకు అనుమతి ఇచ్చింది. కెఎన్​ఆర్​ కన్​స్ట్రక్షన్​ కంపెనీ పనులను దక్కించుకుంది.

మీర్​ ఆలం చెరువుపై (Mir Alam Tank) వంతెన నిర్మాణానికి రూ.430 కోట్లు మంజూరు చేస్తూ గతంలోనే ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. మెట్రోపాలిటన్ ఏరియా మరియు అర్బన్ డెవలప్‌మెంట్ (MAUD)- మూసి రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్( MRDCL) ఆధ్వర్యంలో మీరం ఆలం ట్యాంక్​పై వంతెన (Bridge) నిర్మించనున్నారు. ఈపీసీ (EPC) మోడల్​లో శాస్త్రిపురం వద్ద బెంగళూరు జాతీయ రహదారి నుంచి చింతల్‌మెట్ రోడ్డుకు అనుసంధానించేలా నిర్మించనున్న ఈ ఐకానిక్​ బ్రిడ్జి కోసం ప్రభుత్వం రూ.430 కోట్లు కేటాయించింది. తాజాగా టెండర్లకు సైతం ఆమోదం తెలపడంతో త్వరలో పనులు ప్రారంభించే అవకాశం ఉంది. రూ.304 కోట్లతో కేఎన్​ఆర్​ కంపెనీ పనులు దక్కించుకుంది.

Mir Alam Tank | చెరువు అభివృద్ధికి చర్యలు

నగరంలోని మీరం ఆలం చెరువు అభివృద్ధికి చర్యలు చేపడుతామని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) గతంలో ప్రకటించారు. పాత బస్తీ (Old City) సమీపంలోని మీరం ఆలం చెరువులో కేబుల్​ బ్రిడ్జి నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. ట్రాఫిక్​ రద్దీని తగ్గించడంతో పాటు పర్యాటకులను ఆకర్షించేలా కేబుల్​ సస్పెన్షన్​ బ్రిడ్జి నిర్మిస్తామని గతంలో సీఎం తెలిపారు. ఈ మేరకు తాజాగా వంతెన నిర్మాణానికి టెండర్లు ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. 2.65 కిలోమీటర్ల మేర నాలుగు లేన్లతో ఐకానిక్​ వంతెన నిర్మాణం చేపట్టనున్నారు.

Must Read
Related News