ePaper
More
    HomeతెలంగాణGulzar House | గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం కీలక నిర్ణయం

    Gulzar House | గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం కీలక నిర్ణయం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gulzar House | హైదరాబాద్ hyderabad ​లోని పాతబస్తీలో గల గుల్జార్​ హౌస్ gulzar house​లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంపై fire accident ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మీర్​చౌక్​ సమీపంలోని గుల్జార్​ హౌస్​లో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే సీఎం రేవంత్​రెడ్డి cm revanth reddy విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. తాజాగా ఈ ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం కమిటీని నియమించింది.

    Gulzar House | ఆరుగురు ఉన్నతాధికారులతో..

    పాతబస్తీలోని గుల్జార్​ హౌస్​లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై విచారణకు ప్రభుత్వం ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ వేసింది. ఈ ఘటనపై సమగ్రంగా విచారణ జరిపి నివేదిక అందించాలని సూచించినట్లు హైదరాబాద్ ఇన్​ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ minister ponnam prabhakar తెలిపారు. ఈ కమిటీలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్‌ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ విచారణ అనంతరం సీఎం రేవంత్​రెడ్డికి నివేదిక అందించనుంది.

    Gulzar House | పునరావృతం కాకుండా..

    భవిష్యత్​లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రభుత్వం కమిటీ వేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, ప్రమాదం అనంతరం తీసుకున్న చర్యలపై కమిటీ రిపోర్ట్ సమర్పిస్తుందన్నారు. కాగా.. గుల్జార్​ హౌస్ ప్రమాదంలో చనిపోయిన వారిలో రాజేంద్రకుమార్‌(67) Rajendra kumar , అభిషేక్‌ మోదీ (30), సుమిత్ర (65), మున్నీబాయి (72), ఆరుషి జైన్‌ (17), శీతల్‌ జైన్‌ (37), ఇరాజ్‌ (2), హర్షాలీ గుప్తా (7), రజని అగర్వాల్‌, అన్య మోదీ, పంకజ్‌ మోదీ, వర్ష మోదీ, ఇద్దిక్కి మోదీ, రిషభ్‌ ప్రథమ్‌ అగర్వాల్‌, ప్రాంశు అగర్వాల్‌ ఉన్నారు.

    More like this

    Kamareddy | సీఎం పర్యటన..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...