- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిTenth Results | పదిలో మెరిసిన ‘ప్రభుత్వ’ విద్యార్థులు

Tenth Results | పదిలో మెరిసిన ‘ప్రభుత్వ’ విద్యార్థులు

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Tenth Results | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్​, కస్తూర్బాల్లో విద్యార్థులు తమ ప్రతిభ చూపారు. ఉత్తమ మార్కులు సాధించారు. ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదలతో చదవడంతో పాఠశాలకు మంచి ఫలితాలు వచ్చాయి.

Tenth Results | ఆర్మూర్​ మండలం పిప్రిలో..

అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ మండలం పిప్రి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పరీక్ష ఫలితాలలో వంద ఉత్తీర్ణత నమోదైనట్లు హెచ్ఎం విశ్వనాథ్ తెలిపారు. పాఠశాలకు చెందిన విద్యార్థినులు ఐశ్వర్య 525, సంజన 516 మార్కులు సాధించినట్లు తెలిపారు. మొత్తం నలుగురు విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించారన్నారు.

- Advertisement -

Tenth Results | ఎల్లారెడ్డి కస్తూర్బాలో..

అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల వందశాతం ఉత్తీర్ణత సాధించింది. 40 మంది విద్యార్థులకు గాను అందరూ పాసయ్యారని పాఠశాల ప్రత్యేక అధికారిణి వాసంతి తెలిపారు. అందులో ప్రత్యూష 559, రజిత 551, స్వాతి 547, లావణ్య 543, దేవలక్ష్మి 537 మార్కులు సాధించారని తెలిపారు.

Tenth Results | బిచ్కుందలో..

అక్షరటుడే, బిచ్కుంద: బిచ్కుంద మండలంలోని కేజీబీవీలో 34 మంది విద్యార్థులకు గాను 30 మంది పాసయ్యారు. వైష్ణవి 498,స్మిత 482, కల్పనా 473, వైష్ణవి 472, శైలజ 471 మార్కులు సాధించారు.

Tenth Results | సాలూరా జిల్లా పరిషత్​లో..

అక్షరటుడే, బోధన్: పది ఫలితాల్లో సాలూర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 46 మంది విద్యార్థులకు గాను 43 మంది పాసయ్యారు. అక్షయ్ 553 మార్కులతో స్కూల్ ఫస్ట్ వచ్చాడని హెచ్​ఎం తెలిపారు. ప్రణీత 537, ఉమారాణి 511 మార్కులు సాధించినట్లు చెప్పారు.

Tenth Results | గాంధారి మండల టాపర్​గా హైస్కూల్ విద్యార్థి..

అక్షరటుడే, గాంధారి: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జడ్పీహెచ్​ఎస్​ హైస్కూల్ పోతంగల్ కలాన్​కు చెందిన విద్యార్థిని భవ్యశ్రీ 571 మార్కులు సాధించిందని ఎంఈవో శ్రీహరి తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ పదో తరగతి పరీక్ష రాసేందుకు 377 మంది హాజరుకాగా 351 విద్యార్థులు పాసయ్యారన్నారు. ద్వితీయ స్థానంలో కేటీఎస్ విద్యార్థి రాందాస్ 552 మార్కులతో సెకండ్ టాపర్​గా నిలిచారని వివరించారు.

Tenth Results | 15మంది బాలికలకు 500ల పైనే మార్కులు

అక్షరటుడే, ఆర్మూర్: ఏర్గట్ల మండల కేంద్రంతో పాటు ఐదు జెడ్పీ ఉన్నత పాఠశాలలకు చెందిన పలువురు బాలికలు ఎస్సెస్సీ ఫలితాల్లో అద్భుత ప్రతిభ చూపారు. ఆయా పాఠశాలలకు చెందిన 66 మంది బాలురు, 56 మంది బాలికలు పరీక్షలు రాయగా.. 121 మంది పాసయ్యారని ఎంఈవో ఆనంద్​రావు పేర్కొన్నారు.

Tenth Results | సదాశివనగర్ మోడల్ స్కూల్​లో వందశాతం ఉత్తీర్ణత

అక్షరటుడే, కామారెడ్డి: సదాశివనగర్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణులయ్యారు. పాఠశాలలో మొత్తం 91 మంది విద్యార్థులకు గాను 91 మంది పాసై శతశాతం ఫలితాలను సాధించారు. ఈ ఫలితాల్లో పావని 579, జె.లక్ష్మీప్రసన్న 576, వి.శ్రీకర్ 573, స్నిగ్ధ రెడ్డి 573, 62 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా మార్కులు సాధించారు.

Tenth Results | పోతంగల్ మండల టాపర్​గా రితిక..

అక్షరటుడే, కోటగిరి: పోతంగల్ మండల కేంద్రానికి చెందిన రితిక పదో తరగతి ఫలితాల్లో మండల టాపర్​గా నిలిచింది. మండలం మొత్తంలో ఆరు జిల్లా పరిషత్ పాఠశాలలు ఉండగా, పోతంగల్ తెలుగు మీడియం జిల్లా పరిషత్ పాఠశాల చదువుతున్న విద్యార్థిని రితిక 546 మార్కు సాధించింది. దీంతో విద్యార్థినిని మండల నాయకులు సత్కరించారు. కార్యక్రమంలో బజరంగ్, అశోక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Tenth Results | సత్తా చాటిన గురుకుల పాఠశాల విద్యార్థులు

అక్షరటుడే నిజాంసాగర్: పెద్ద కొడప్​గల్​ మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు మండల స్థాయిలో ప్రతిభ చూపారు. గురుకుల పాఠశాల విద్యార్థులు జే లావణ్య 541, అర్చన 540, రాజేశ్వరి 537 మార్కులు సాధించి మండల స్థాయిలో నిలిచారు. మండలంలో మొత్తం 213 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 86.4శాతం ఉత్తీర్ణత సాధించారని ఎంఈవో ప్రవీణ్ కుమార్ తెలిపారు.

Tenth Results |సత్తా చాటిన నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాలు

అక్షరటుడే, నిజాంసాగర్​: నిజాంసాగర్, మహమ్మద్​నగర్ మండలాల విద్యార్థులు సత్తా చాటారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట నిజాంసాగర్, మల్లూరు అచ్చంపేట గురుకుల పాఠశాల కస్తూర్బా పాఠశాల, ఆదర్శ పాఠశాలలో 340 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా వారిలో 334 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 98.25% ఉత్తీర్ణతను నమోదు చేసుకున్నారు. వీరిలో అచ్చంపేట గురుకుల పాఠశాలలో చదివిన రవి 565 మార్కులతో మండల టాపర్​గా నిలిచారు.

ఇక మహమ్మద్ నగర్ మండలంలోని మహమ్మద్ నగర్, సింగితం, గాలిపూర్, కోమలంచ పాఠశాలలో 85 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. వారిలో సింగితం ఉన్నత పాఠశాల విద్యార్థిని నిహారిక 540 మార్కులతో మహమ్మద్ నగర్ మండల టాపర్​గా నిలిచింది. విద్యార్థులను ఆయా మండలాల విద్యాశాఖ అధికారులు తిరుపతిరెడ్డి, అమర్ సింగ్ లు అభినందించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News