అక్షరటుడే, ఆర్మూర్: Paddy Centers | తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు నూతుల శ్రీనివాస్‌రెడ్డి(Nutula Srinivas Reddy) డిమాండ్ చేశారు.
వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ (Meteorological Department) హెచ్చరించినప్పటికీ అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల(Farmers) కష్టం నీటిపాలైందన్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే రైస్‌మిల్లులకు పంపేవిధంగా ఆదేశించాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు.