అక్షరటుడే, ఆర్మూర్: Armoor | అకాల వర్షాలతో తడిసి ముద్దయిన వరి ధాన్యాన్ని (paddy rice) ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆర్మూర్‌లోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో (IFTU office) బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆకుల పాపయ్య మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి రైతలు పంటలు పండిస్తే, అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంట చేజారి పోతోందన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని ఆకుల పాపయ్య (Akula Papayya) పేర్కొన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తే రైతుల కష్టాలు (Farmers Problems) తీర్చినవారవుతారని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను పెంచామని ప్రకటించినప్పటికీ సహకార సంస్థల నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని స్పష్టం చేశారు. ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దాసు మాట్లాడుతూ.. అన్నదాతను కన్నీళ్లు పెట్టిస్తే ప్రభుత్వాలు పతనం కాక తప్పవని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఆర్మూర్ డివిజన్ కమిటీ నాయకులు సూర్య శివాజీ, అబ్దుల్, బాలయ్య, ప్రజా సంఘాల నాయకులు ప్రిన్స్, చిట్టక్క, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

