అక్షరటుడే, గాంధారి: Ex Mla Jajala | భారీవర్షాలకు జరిగిన నష్టానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఆదివారం గాంధారి (Gandhari) మండలంలో పర్యటించారు.
భారీ వర్షానికి గంగమ్మ గుడి (Gamgamma Gudi), బొప్పాజి వాడి చెరువు కట్ట దెబ్బతినగా, మరమ్మతు పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరదల కారణంగా నష్టపోయినవారికి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు బీఆర్‌ఎస్ పార్టీ (BRS Party) ఎల్లప్పుడు అండగా ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో పంట నష్టం అంచనా వేయించి రైతులకు నష్ట పరిహారం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.