ePaper
More
    HomeతెలంగాణMedigadda | కేటీఆర్​ ఆరోపణలపై ప్రభుత్వం సీరియస్​.. సీబీఐకి కేసు అప్పగించాలని యోచన

    Medigadda | కేటీఆర్​ ఆరోపణలపై ప్రభుత్వం సీరియస్​.. సీబీఐకి కేసు అప్పగించాలని యోచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medigadda | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ (KTR) గురువారం చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్​ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్​ కాళేశ్వరం ప్రాజెక్టులో (Kaleshwaram project) కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ (Medigadda barrage) పగుళ్లకు కాంగ్రెస్‌ వాళ్లే కారణం కావొచ్చని ఆరోపించారు. వాళ్లే బాంబులు పెట్టి ప్రాజెక్ట్​ పేల్చి ఉంటారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్యారేజీలో కేవలం రెండు చోట్ల పగుళ్లు వస్తే.. ఏదో అయిపోయినట్టు చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో కాంగ్రెస్​ వాళ్లే బాంబులు పెట్టి ఉంటారని ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్​గా తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయంలో అసలు నిందితులు ఎవరో తేల్చడానికి కేసు సీబీఐకి అప్పగించాలని యోచిస్తున్నట్లు సమాచారం.

    Medigadda | గతంలోనే కేసు నమోదు

    బీఆర్​ఎస్​ హయాంలోనే మేడిగడ్డ బ్యారేజి (Medigadda barrage) కుంగిపోయింది. ఎన్నికల ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ సమయంలోనే నీటిపారుదల శాఖ ఏఈఈ రవికాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారీ శబ్ధంతో పిల్లర్లు కుంగిపోపయాయని, దీని వెనక ఏవైనా సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయోమోనని ఆయన మహదేవ్​పూర్​ పోలీస్ స్టేషన్​లో (Mahadevpur police station) ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తాజాగా కేటీఆర్​ (KTR) సైతం అలాంటి వ్యాఖ్యలే చేయడంతో ప్రభుత్వం సీబీఐ విచారణ (CBI inquiry) అప్పగించాలని యోచిస్తున్నట్లు సమాచారం.

    Medigadda | కొనసాగుతున్న కాళేశ్వరం కమిషన్​ విచారణ

    కాళేశ్వరం ప్రాజెక్ట్​లో (Kaleshwaram project) అక్రమాలు, మేడిగడ్డ కుంగిన విషయమై ఇప్పటికే ప్రభుత్వం జస్టిస్​ ఘోష్​ కమిషన్​ (Justice Ghosh Commission) ఏర్పాటు చేసింది. ఆ కమిషన్​ విచారణ ఇంకా కొనసాగుంది. ఇటీవల కమిషన్​ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​తో (KCR) పాటు, మాజీ మంత్రులు హరీశ్​రావు (Harish Rao), ఈటల రాజేందర్​కు (Etela Rajender) నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో ఓ వైపు కమిషన్​ విచారణ సాగుతుండగా.. సీబీఐకి (CBI) కేసు అప్పగించవచ్చా లేదా అని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ మేరకు న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్ట్​ విషయంలో అసలు దోషులు ఎవరో తేల్చడానికి సీబీఐ విచారణ (CBI inquiry) అయితే బాగుంటుందని సర్కార్​ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

    More like this

    Nepal | నేపాల్‌ లో విధ్వంసం.. అధ్యక్షుడు, ప్రధాని ఇళ్లకు నిప్పు.. పలువురు మంత్రులపై దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌ లో రెండోరోజూ విధ్వంసకాండ కొనసాగింది. యువత ఆందోళనలతో హిమాయల దేశం...

    CP Sai Chaitanya | పోలీస్​ ఇమేజ్​ పెంచేవిధంగా విధులు నిర్వర్తించాలి: సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitanya | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పోలీస్​ ఇమేజ్​ను పెంచే విధంగా సిబ్బంది...

    Alumni reunion | 14న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, భిక్కనూరు: Alumni reunion | మండలంలో జిల్లా పరిషత్​ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం...