అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Erragadda Hospital | ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి (Erragadda Mental Hospital)లో ఫుడ్‌పాయిజన్ (Food Poison) ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది.
ఆస్పత్రిలో ఫుడ్ పాయిజన్ అయి ఒక రోగి మృతి చెందగా.. 92 మంది రోగులకు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Monister Rajanarsimha) బుధవారం ఆస్పత్రిని తనిఖీ చేశారు. సూపరింటెండెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఈ వివరాలను సీఎం రేవంత్‌రెడ్డికి వివరించడంతో ముఖ్యమంత్రి సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆస్పత్రిలో రోగులకు కలుషిత ఆహారం సరఫరాపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (RMO) డాక్టర్ పద్మజను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టర్ తీవ్ర నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు గుర్తించారు.
దీంతో కాంట్రాక్టర్ జైపాల్ రెడ్డిని తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే శానిటేషన్ కాంట్రాక్ట్ రద్దుకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ప్రజారోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.