అక్షరటుడే ఆర్మూర్: Makloor | మాక్లూర్ మండల కేంద్రంలో సోమవారం జడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్ పాఠశాలలకు (ZPHS and MPPS schools) సంబంధించి నూతన భవనాలను సోమవారం ప్రారంభించారు.
నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా (Bigala Ganesh Gupta) తండ్రి బిగాల కృష్ణమూర్తి, తాత బిగాల గంగారం జ్ఞాపకార్థం రూ. కోటి సొంత నిధులు, విద్యాశాఖ నిధులు (education department funds) రూ.5.70 కోట్లతో నిర్మించిన పాఠశాలలను ప్రారంభించారు. రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి (MLA Paidi Rakesh Reddy), బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) ప్రారంభోత్సవం చేశారు. కాగా.. ఈ భవనాలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనానికి బిగాల కృష్ణమూర్తి, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనానికి బిగాల గంగారం అని నామకరణం చేశారు.
ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి బిగాల గణేశ్ గుప్తా, బిగాల మహేశ్ గుప్తా సోదరులను అభినందించారు. కార్యక్రమంలో నిజామాబాద్ మాజీ మేయర్ నీతూకిరణ్, మాజీ జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.