Homeజిల్లాలునిజామాబాద్​School Reopen | పదకొండేళ్ల తర్వాత తెరుచుకున్న సర్కారు బడి.. ఎక్కడంటే..?

School Reopen | పదకొండేళ్ల తర్వాత తెరుచుకున్న సర్కారు బడి.. ఎక్కడంటే..?

- Advertisement -

అక్షరటుడే, బోధన్​: School Reopen | సుమారు 11 ఏళ్ల క్రితం మూతబడ్డ సర్కారు బడి ఎట్టకేలకు బుధవారం తెరుచుకుంది. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. బోధన్ (Bodhan) మండలంలోని భవానీపేట్​లో (Bhavani pet) ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు లేక మూతబడింది. అప్పటి నుంచి బడి మూతబడడంతో స్థానికులు సైతం ఇబ్బందులు పడ్డారు.

ఇన్నేళ్లకు బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో ఎంఈవో నాగయ్య ఆధ్వర్యంలో బుధవారం స్కూల్​ను​ పున:ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్​ కలెక్టర్​ మాట్లాడుతూ.. బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని అప్పుడే పాఠశాల మనుగడ సాధ్యమవుతందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన వివరించారు. కార్యక్రమంలో స్థానికులు తదితరలు పాల్గొన్నారు.

స్కూల్​ ప్రారంభోత్సవం సందర్భంగా కొబ్బరికాయ కొడుతున్న ఎంఈవో నాగయ్య

Must Read
Related News