Government schemes | పేదలకు అండగా ప్రభుత్వ పథకాలు
Government schemes | పేదలకు అండగా ప్రభుత్వ పథకాలు

అక్షరటుడే, బాన్సువాడ/కోటగిరి: Government schemes | ప్రభుత్వ పథకాలు పేదలకు అండగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని 9 మండలాల సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు మంగళవారం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 113 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి రూ. 42.40 లక్షలు, 77 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ రూ. 77.08 లక్షల చెక్కులను అందజేసినట్లు తెలిపారు.

కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ హన్మంత్, బీర్కూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్యామల, మాజీ మున్సిపల్ ఛైర్మన్ గంగాధర్, పోతంగల్ మండలాధ్యక్షుడు పుప్పాల శంకర్, సుదర్శన్, నార్ల సురేష్, ఎజాజ్, పిట్ల శ్రీధర్, ఖాలెక్ తదితరులు పాల్గొన్నారు.