అక్షరటుడే ఇందూరు: Nizamabad Collector | ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. జిల్లా కలెక్టరేట్లో గురువారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, వనమహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణ తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వనమహోత్సవంలో భాగంగా జిల్లాలో 51 లక్షలకు పైబడిన మొక్కలు నాటాల్సినందున లక్ష్యసాధనకు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఆయా శాఖల వారీగా రెండు రోజుల్లో నిర్దేశిత లక్ష్యాలకు మించి మొక్కలు నాటించాలని ఆదేశించారు. అన్ని మండలాల్లో వనమహోత్సవం నిర్వహించాలని సూచించారు.
Nizamabad Collector | భారీ వర్షాలు కురిసే అవకాశం
భారీ వర్షాలు (heavy rains) కురిసే అవకాశాలు ఉన్నందున అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. గతంలో అతివృష్టి సమయాల్లో తీసుకున్న చర్యలు సమీక్షించి ప్రస్తుత ఏర్పాట్లు చేపట్టాలన్నారు. వర్షాల వల్ల ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు (control room) సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
Nizamabad Collector | ఆయిల్ పామ్ సాగుచేసేలా చూడాలి
రైతులకు ఆయిల్ పామ్ (oil palm) సాగు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగు చేయడం వల్ల సమకూరే లాభాలు ప్రభుత్వ సబ్సిడీ, గిట్టుబాటు ధర, దీర్ఘకాలిక లాభాలు, కోతుల బెడద లేకపోవడం తదిత అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో 3,500 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేయాల్సి ఉండగా 1,242 ఎకరాల్లో మాత్రమే పంట సాగుకు రైతులు ముందుకు వచ్చారని తెలిపారు.
టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమానికి (TB Mukt Bharat Abhiyan program) ప్రాధాన్యతనిస్తూ జిల్లాలో క్షయ వ్యాధి నిర్మూలనకు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని పాజిటివ్ వచ్చినవారు క్రమం తప్పకుండా చికిత్స చేయించుకునేలా పర్యవేక్షించాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్ (Additional Collectors Ankit Kiran Kumar), ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి (Trainee Collector Caroline Chingtianmavi), నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.