అక్షరటుడే, కామారెడ్డి: Mla KVR | గడిచిన రెండేళ్లలో కామారెడ్డి మున్సిపాలిటీలో అవినీతికి ఆస్కారం లేకుండా తనవంతు ప్రయత్నం చేశానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (MLA Katipally Venkata Ramana Reddy) అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో గురువారం మున్సిపల్ ఎన్నికల (municipal elections) సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పోటీకి సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. కామారెడ్డి మున్సిపాలిటీలో అవినీతి పోవాలంటే బీజేపీ అభ్యర్థులు గెలవాలన్నారు. గత రెండేళ్ల కాలంలో అవినీతి జరగకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేశానని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థులు గెలిస్తే కామారెడ్డిని ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందన్నారు. కార్యకర్తలంతా కలిసి పని చేసి బీజేపీ అభ్యర్థులు గెలిచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.