అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | పట్టణాభివృద్ధిలో భాగంగా రోడ్లన్నీ అందంగా తీర్చిదిద్దినునట్లు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అన్నారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద రూ.2.14 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు గురువారం ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజుతో (Kasula Balaraju) కలిసి భూమి పూజ చేశారు.
Mla Pocharam | పట్టణ అభివృద్ధిలో..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధిలో భాగంగా నాణ్యమైన రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. బీటీ రోడ్డు నిర్మాణం (road construction) పూర్తయితే అంబేడ్కర్ చౌరస్తా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గి, ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, పోచారం సురేందర్ రెడ్డి, జంగం గంగాధర్, నార్ల సురేష్, ఎజాజ్, కృష్ణారెడ్డి, గోపాల్ రెడ్డి, మహమ్మద్ గౌస్, దావుడ్, లింగం, కోయగుట్ట రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.