Homeజిల్లాలునిజామాబాద్​MLA Sudarshan Reddy | సాంకేతిక విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత

MLA Sudarshan Reddy | సాంకేతిక విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: MLA Sudarshan Reddy | సాంకేతిక విద్యాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో (Collector Vinay Krishna Reddy) కలిసి శుక్రవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా నాణ్యమైన విద్యను అందిస్తే భవిష్యత్తులో విద్యార్థులు మంచి ఉపాధి అవకాశాలు పొందుతారన్నారు. బోధనా సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తించాలని తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలకు (Polytechnic College) అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూరుస్తూ.. అవసరమైన సిబ్బంది నియమించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

MLA Sudarshan Reddy | సమీక్ష

పాలిటెక్నిక్ కళాశాలలో ఒక్కో విభాగం వారిగా నమోదైన ఫలితాలను, అధ్యాపకుల ఖాళీలు, అవసరమైన మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం తరగతి గదులు, వర్క్ షాప్​లను సందర్శించి, పని తీరును పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి శిక్షణ తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు.

MLA Sudarshan Reddy | డిప్లొమా తర్వాత ఉత్తమ అవకాశాలు..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం ఉత్తీర్ణత సాధిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని, ప్రతిభను కొలమానంగా గుర్తిస్తూ ఆయా సంస్థలు ఉపాధి కల్పిస్తున్నాయని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పోటీ పరీక్షల్లో కూడా ఉత్తమ ప్రతిభను చాటాల్సిన ఆవశ్యకత నెలకొందన్నారు.

డిప్లొమా అనంతరం పైచదువులు చదివితే మంచి అవకాశాలు ఉంటాయని వివరించారు. ఇకపై ప్రతి మూడు నెలలకోసారి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల నిర్వహణ, ఫలితాల సాధనపై సమీక్ష నిర్వహిస్తానని స్పష్టం చేశారు. వారి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ (Urdu Academy) ఛైర్మన్ తాహెర్​బిన్​ హందాన్​, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ (State Cooperative Union Limited) ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, డీసీసీబీ (DCCB) ఛైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ (District Library Association) ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్పగంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి