అక్షరటుడే, వెబ్డెస్క్ : Local Body Elections | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) కోసం ప్రభుత్వం మళ్లీ కసరత్తు చేస్తోంది. పూర్తిస్థాయిలో నోట్ తయారు చేయాలని పంచాయితీ రాజ్ శాఖను (Panchayat Raj Department) ఆదేశించింది.
రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ()MPTC and ZPTC elections), మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి షెడ్యూల్ సైతం వెలువరించింది. అయితే ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం తెచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. నోటిఫికేషన్ను సైతం ఎన్నికల సంఘం క్యాన్సిల్ చేసింది. అయితే మొన్నటి వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by-election) సందడి ఉండటంతో స్థానిక ఎన్నికల గురించి అంతగా ఎవరు పట్టించుకోలేదు. ఆ ఎన్నిక ముగియడంతో ప్రస్తుతం స్థానిక ఎన్నికలపై మళ్లీ చర్చ జరుగుతోంది.
Local Body Elections | రిజర్వేషన్లు ఎలా..
స్థానిక ఎన్నికలపై ఈ నెల 24లోగా నిర్ణయం తెలపాలని హైకోర్టు (High Court) ఆదేశించింది. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఎన్నికల నిర్వహణ తేదీలు వెల్లడించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఈనెల 17న జరిగే కేబినెట్ భేటీలో (cabinet meeting) చర్చించి కోర్టుకు తెలిపే అవకాశం ఉంది. అయితే బీసీ రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉంది. సుప్రీంకోర్టులో సైతం ప్రభుత్వానికి చుక్కెదురైన విషయం తెలిసిందే. దీంతో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు వెళ్లే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లు (BC reservations) లేకుండా ఎన్నికల నిర్వహణకు కోర్టులు అనుమతించిన విషయం తెలిసిందే.
Local Body Elections | ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ
స్థానిక ఎన్నికల కోసం ప్రజలు చాలా రోజులుగా నిరీక్షిస్తున్నారు. పల్లెల్లో సర్పంచులు (sarpanches) లేక పాలన అస్తవ్యస్తంగా మారింది. దీంతో ఎన్నికలు ఎప్పుడు పెడతారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఆశావహులు సైతం ఎన్నికల కోసం అనేక రకాలుగా ఇప్పటికే సిద్ధం అయ్యారు. దీంతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గ సమావేశం అనంతరం స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
