అక్షరటుడే, వెబ్‌డెస్క్ : New DISCOM | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ రంగంలో మూడో డిస్కమ్ ఏర్పాటుపై ఉత్తర్వులు జారీ చేసింది. 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త డిస్కం (new DISCOM) కార్యక్రమాలు ప్రారంభించాలని ఆదేశించింది.
రాష్ట్రంలో ప్రస్తుతం రెండు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఉన్నాయి. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ (SPDCL and NPDCL) వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి. ప్రజలకు, రైతులకు ఉచిత విద్యుత్ లాంటి సంక్షేమ పథకాల నిర్వహణ, విద్యుత్ రంగాన్ని సంస్కరించడం కోసం కొత్త డిస్కం ఏర్పాటు చేశారు. 29,08,138 కనెక్షన్లు మూడో డిస్కమ్‌కు బదిలీ చేయనున్నారు. అందులో వ్యవసాయ కనెక్షన్లు 29,05,779, ఎత్తిపోతల పథకాలు (lift irrigation schemes)489, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి 9, మిషన్ భగీరథ 1,132, మున్సిపల్ నీటి సరఫరా (ఎల్టి VI-బి): 639 కనెక్షన్లు ఉంటాయి.
New DISCOM | ఎల్టీ లైన్లు
5,22,479 వ్యవసాయ డీటీఆర్లు కొత్త డిస్కమ్‌కు బదిలీ చేయనున్నారు. మొత్తం డీటీఆర్ సామర్థ్యం 19,088 ఎంవీఏ. 2,61,240 కి.మీ.ల వ్యవసాయ ఎల్టీ లైన్లు ట్రాన్స్ఫర్ చేయనున్నారు. బదిలీ చేయనున్న మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.4,929 కోట్లు ఉంటుంది. అన్ని వ్యవసాయ డీటీఆర్‌లకు స్మార్ట్ మీటర్లు అమరుస్తారు. దీనికి సుమారు రూ.1,306 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.
New DISCOM | విద్యుత్ అవసరాల వాటా
గత ఐదేళ్ల సగటు ఆధారంగా డిస్కమ్‌ల వాటా ఇలా ఉంది. మూడవ డిస్కమ్ 42 శాతం (1,56,775 ఎంయూ) వాటా కలిగి ఉండనుంది. ఎస్పీడీసీఎల్ 45శాతం (1,70,034 ఎంయూ), ఎన్పీడీసీఎల్ 13% (49,720 ఎంయూ) వాటా కలిగి ఉంటాయి. రూ.35,982 కోట్ల బకాయిలు కొత్త డిస్కమ్‌కు బదిలీ చేయబడతాయి. ఇందులో ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన రూ.22,926 కోట్లు, జలమండలికి చెందిన రూ.7,084 కోట్లు, మిషన్ భగీరథ బకాయిలు రూ.5,972 కోట్లు ఉన్నాయి.
New DISCOM | 2 వేల మంది ఉద్యోగులు
కొత్త డిస్కామ్లో 2,000 మంది ఉద్యోగులు పనిచేస్తారు. ఇందులో ఇంజినీలర్లు 660 మంది, నిర్వహణ, మరమ్మతు సిబ్బంది 1,000 మంది, పరిపాలన సిబ్బంది 340 ఉంటారు.