HomeతెలంగాణKaleshwaram corruption | కాళేశ్వరం అవినీతిపై విచారణకు కేంద్రానికి సర్కారు లేఖ

Kaleshwaram corruption | కాళేశ్వరం అవినీతిపై విచారణకు కేంద్రానికి సర్కారు లేఖ

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Kaleshwaram corruption | కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై మరింత లోతుగా విచారణ చేపట్టేందుకు తెలంగాణ సర్కారు సిద్ధం అవుతోంది. బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్​రావు, అవినీతిలో తలమునకలైన నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల మెడకు ఉచ్చు బిగించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఇప్పటికే జస్టిస్​ పీసీ ఘోష్ కమిషన్​​ను నియమించింది. కమిషన్​ ఇచ్చిన నివేదికను ఇటీవలే అసెంబ్లీలో ప్రవేశపెట్టి, ప్రత్యర్థి పార్టీ బీఆర్​ఎస్​ను పూర్తిగా నీరుగార్చే ప్రయత్నం చేసింది. తాజాగా మరిన్ని చర్యలకు దిగింది. కేంద్ర హోంశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కాళేశ్వరం అవినీతిపై విచారణ చేయాలని లేఖలో రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ చేపట్టాలని కోరింది.

Kaleshwaram corruption : హైకోర్టులో సర్కారు మెమో దాఖలు

మరోవైపు కాళేశ్వరంపై సర్కారు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించబోతోంది. హైకోర్టు High Court లో సర్కారు మెమో దాఖలు చేయనున్నట్లు తెలిసింది. సీబీఐ విచారణకు ఆదేశించినట్లుగా ప్రభుత్వం తెలపనుంది.

MHAకు రాసిన లేఖను కోర్టుకు తెలంగాణ సర్కారు సమర్పించనుంది. ఇలా మొత్తంగా భారాసకు అవినీతి మరక అంటించి రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికి లేకుండా చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తోంది.

ఇక ఎమ్మెల్సీ కవిత రగిల్చిన కుంపటి బీఆర్​ఎస్​లో ఇప్పటికే రగులుతోంది. తాజాగా మాజీ మంత్రి హరీశ్​రావు, సంతోష్​, మేఘా సంస్థలపై కవిత విరుచుకుపడ్డారు. వీరి వల్లే తన తండ్రి కేసీఆర్​కు ఈ దుస్థితి ఏర్పడినట్లు MLC Kavitha పేర్కొన్నారు.