అక్షరటుడే, వెబ్‌డెస్క్: UPSC | నిరుద్యోగులకి గొప్ప శుభవార్త. ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ (UPSC Notification) విడుదలైంది.
ప్రత్యేకంగా 493 పోస్ట్‌లకి సంబంధించి UPSC దరఖాస్తులు కోరుతుంది. అర్హత ఉన్న అభ్యర్ధులు కేవలం రూ.25 మాత్రమే ఫీజు చెల్లించి మే 24వ తేది నుండి జూన్ 12వ తేది వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్ట్ పేరు ఎన్ని ఖాళీలు అనేవి చూస్తే.. లీగల్ ఆఫీసర్ గ్రేడ్1 -2 ఖాళీలు, ఆపరేషన్స్ ఆఫీసర్ (Operations Officer) -121 ఖాళీలు, సైంటిఫిక్ ఆఫీసర్- 12 ఖాళీలు, సైంటిఫిక్ ఆఫీసర్ -12 ఖాళీలు, సైంటింస్ట్- బీ (మెకానికల్): 01, అసోసియేట్ ప్రొఫెసర్ సివిల్- 2, అసోసియేట్ ప్రొఫెసర్ మెకానికల్ -1 ఉన్నాయి.
UPSC | మంచి ఛాన్స్..
సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్- 3, జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్- 24 ,డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ (Data Processing Assistant) – 1 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ -5, ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్- 1, ప్రిన్సిపల్ డిజైన్ ఆఫీసర్ -1, రీసెర్చ్ ఆఫీసర్ ఒకటి ట్రాన్స్లేటర్ -2, అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ ఐదు అసిస్టెంట్ డైరెక్టర్- 20 , పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ గ్రేడ్3- 18 , స్పెషలిస్ట్ గ్రేడ్ 3- 122, ట్రైనింగ్ ఆఫీసర్ -94 ,అసిస్టెంట్ ప్రొడక్షన్ మేనేజర్ టు అసిస్టెంట్ ఇంజనీర్ -5, సైంటిస్ట్ బి -6, డిప్యూటీ డైరెక్టర్ -2 (Deputy Director) ,అసిస్టెంట్ కంట్రోలర్ ఫైవ్ స్పెషలిస్ట్ గ్రేడ్3- 21.. ఇలా మొత్తం ఖాళీల (job vacancies) సంఖ్య 493.
వయో పరిమితి 30 నుంచి 50 ఏళ్లు. దరఖాస్తు ప్రక్రియ (Application process) ఆన్లైన్ ద్వారా ఉంటుంది. దరఖాస్తు ప్రారంభ తేదీ మే 24 2025 కాగా, చివరి తేదీ జూన్ 12, 2025. దరఖాస్తు ఫీజు 25 రూపాయలు మాత్రమే. అయితే అర్హత పోస్టుల్ని అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీటెక్, LLB ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి . పూర్తి వివరాలు యూపీఎస్సీ వెబ్ సైట్ (UPSC website) చూడవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది.